పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3 యడ్లపాడు మండల ప్రతినిధి.. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా యడ్లపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ పి. ఝాన్సీ సాగర్ మండలంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే త్యాగానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినమని, ఈస్టర్ పర్వదినం ఆశ, పునరుత్థానం, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలని కోరుకున్నారు. అలాగే సమాజంలో పరస్పర గౌరవం, సహనం, సౌభ్రాతృత్వం మరింత పెరగాలని ఆకాంక్షించారు… మండలంలోని క్రైస్తవ మిత్రులందరికీ గుడ్ ఫ్రైడే & ఈస్టర్ శుభాకాంక్షలు