పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 3, జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ బాలానగర్ మండల పరిధిలోని నేరేళ్లపల్లి గ్రామపంచాయతీలో ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది మొదటగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయహే తెలంగాణ తో ప్రారంభమై తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని చదివి వినిపించడం జరిగింది అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక బహుళ సంక్షేమ పథకాలను జరుగుతున్న అభివృద్ధి గురించి గ్రామసభలో తెలియజేయడం జరిగింది గ్రామ సభలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని అర్హుల జాబితాను ఎటువంటి పక్షపాతం లేకుండా ఎంపిక చేయాలని ప్రగతి పథంలో గ్రామపంచాయతీ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పంచాయితీలు అవసరాల నిమిత్తం వినియోగించుకోవాలని దుర్వినియోగానికి గ్రామపంచాయతీలు నిదర్శనంగా ఉండకూడదు అని ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పెషలాఫీసర్ ఎంఈఓ ఏ శంకర్ నాయక్ గ్రామ సర్పంచ్ సమీనా జమీర్ పాషా ఉప సర్పంచ్ సత్యనారాయణ పాలకవర్గ సభ్యులు ఇ అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ ప్రభుత్వ ఉన్నత ప్రభుత్వ ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులు గ్రామ యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు