
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం బీసీ బాయ్స్ హాస్టల్* కి ఆకస్మికంగా వెళ్లడం జరిగింది అక్కడ పరిస్థితులను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు కొన్ని సమస్యలు పిల్లలు చెప్పడంతో సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు పోయిన వైయస్సార్ ప్రభుత్వం 12 మరుగుదొడ్లను నిర్మించింది కానీ పైపులైను వెయ్యలేదు మరుగు దొడ్లకు గుంతలు కూడా లేవు* అంతా మధ్యలో వదిలేసి వెళ్లిపోయినరు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసి చాలా బాధ పడ్డారు అంతేకాదు సమ్మర్ రావడంతో రూమ్ లో ఫ్యాన్స్ లేవు పిల్లలు ఎలా పడుకుంటాను నువ్వు ఏమీ మెయింటెన్ చేస్తున్నావు అని అడిగారు అంతేకాదు రోజు ఎగ్స్ కూడా పిల్లలకు సరిగ్గా ఇవ్వడం లేదని* చెప్పడం వల్ల చైర్మన్ సీరియస్ యాక్షన్ తీసుకుని కర్నూలు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడం జరిగింది అంతేకాదు ఈ బి సి హాస్టల్ కి తన సొంత ఖర్చుతో తరఫున 5 ఫ్యాన్లు స్పాట్గా తెప్పించి వేస్తానని చెప్పినారు* కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యారంగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నరు_* అలాగే పేద ప్రజలు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు అలాంటి పిల్లలకు ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులను ఆదుకుంటుంది మీరు ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తే లోకేష్ దృష్టికి తీసుకెళ్లవలసి వస్తుంది అని చెప్పినారు విద్యార్థులకు మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పండి మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని విద్యార్థులకు భరోసానం కల్పించారు.