పాదయాత్రతో భద్రాచలం తరలి వెళ్లిన నారాయణపురం భక్తులు..

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 3 ,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన కొంతమంది భక్తులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని రాములోరిని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నారాయణపురంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హిందుత్వ జెండాలను చేతపట్టుకుని పాదయాత్రగా బయలుదేరి తరలి వెళ్లారు. సుమారు 8 మంది పాదయాత్రగా రాముల వారి గేయాలను ఆలపిస్తూ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు పండాలని స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడిమళ్ళ కిషోర్ రెడ్డి, రెడ్ ఎం రామకృష్ణారెడ్డి. రెడ్ యం రామిరెడ్డి.రెడ్డి ఆదినారాయణ .ఎర్రమల నాగార్జున రెడ్డీ.ఎర్రమల సైదిరెడ్డి. జీడిమల్ల కౌశిక్ రెడ్డిఇతర భక్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *