జహీరాబాద్ పంచముఖి ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు): జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీలో వెలసిన పంచముఖి ఆంజనేయస్వామి ఆలయ 18వ వార్షికోత్సవం మరియు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం మరియు నవగ్రహ సహిత శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనతో పాటు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు మచ్చేందర్, రాథోడ్ భీమ్ రావు నాయక్, మోహన్ రాథోడ్, ప్రభు పటేల్, చిన్న రెడ్డి, జగదీష్, పాండురంగా రెడ్డి, పరమేశ్ పటేల్ మరియు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని పలు హనుమాన్ ఆలయాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *