పాయనించే సూర్యుడు 3.4.2026 రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ అనకాపల్లిజిల్లా (చీడికాడ), ఏప్రిల్ 02, 2026: చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన భారీ గంజాయి రవాణా కేసులో చోడవరంలోని 9వ అదనపు జిల్లా కోర్టు గౌరవ జడ్జి ఎం.హరి నారాయణ ఈరోజు కీలక తీర్పును వెల్లడించారు. నేరం నిరూపితమైన ముగ్గురు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.1,00,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసు నేపథ్యం: గత 13.10.2016న చీడికాడ మండలం, అప్పలరాజుపురం సమీపంలోని త్రిషింగ్ ఫ్లోర్స్, చేపలచెరువు వద్ద సుమారు 300 కిలోల గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచి, తరలించేందుకు సిద్ధంగా ఉన్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి పది ప్లాస్టిక్ బస్తాలలో తరలిస్తుండగా, అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై జి.అప్పారావు మరియు వారి సిబ్బంది దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. శిక్ష పడిన నిందితుల వివరాలు: కోర్టు ద్వారా శిక్ష ఖరారైన నిందితులు (అందరూ చీడికాడ మండలం, బైలపూడి గ్రామానికి చెందినవారు):
బొట్టా ఈశ్వరరావు (A-1), తండ్రి: పైడిబాబు. గోకాడ తాతబాబు (A-5), తండ్రి: సన్నీ బాబు.
గోకాడ చెల్లు బాబు (ఏ -6), తండ్రి: కుల్లు బాబు. వీరిపై ఎన్ డి పి స్ చట్టంలోని సెక్షన్ 20(బీ)(ii)(సి) ర్/డబ్లుయు 8(c) కింద నేరం రుజువు కావడంతో, గౌరవ న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో నిందితులు అదనంగా మరో 2 ఏళ్ల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసెక్యూషన్ తరపున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాస్క్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణ పకడ్బందీగా దర్యాప్తు చేసిన నాటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై అప్పారావుని కోర్టు మానిటరింగ్ సెల్ మరియు చీడికాడ పోలీస్ సిబ్బందిని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసుల కృషిని, న్యాయస్థానం వెలువరించిన ఈ కఠిన తీర్పును ఎస్పీ స్వాగతించారు. జిల్లా పోలీస్ కార్యాలయం, అనకాపల్లి జిల్లా.