
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 03 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలు, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యచరణ ప్రణాళిక) లో భాగంగా బూర్గంపహడ్ మండల కేంద్రంలో సారపాక గ్రామపంచాయతీలో గ్రామస్థాయి ప్రజా పాలన గ్రామసభను సర్పంచ్ గూగుల్ కిషోర్ శివరాం నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసారు. గ్రామ పంచాయతీలో పలు అంశాల పై గ్రామ సభ కొనసాగింది. ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు ఎన్ని, వాటిని ఎలా వినియోగించుకుంటున్నాము అనే అంశంపై ప్రజల సమక్షంలో ఆ శాఖల యొక్క అధికారులు సభా ముఖంగా చదివి వినిపించారు. పేద ప్రజలకు ప్రభుత్వం నుండి అందే ప్రతి రూపాయి వారికి అందేలా చూడాలని, సియం రేవంత్ రెడ్డి కృషితో ప్రభుత్వ పరంగా అభివృద్ధి పంట పండి, నిధుల వరద పారుతోంది అని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరికైతే గేదెలు, గొర్రెలు ఉన్నాయో వారు పంచాయతీకి వచ్చి దరఖాస్తు చేసుకుంటే వారికి షెడ్డు కూడా పంచాయతీ వారే ఏర్పాటు చేస్తారని తెలియజేశారు. గ్రామ ప్రజలు ప్రభుత్వ అధికారి రవీంద్రనాథ్ ఠాగూర్ కి సమస్యలను చెప్పుకొని దరఖాస్తులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారపాక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ప్రభుత్వ అధికారి రవీంద్రనాథ్ ఠాగూర్, ఈవో మహేష్, ఉప సర్పంచ్ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారం వెంకటేష్ రెడ్డి, ఇంగువ రమేష్, సుధాకర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొనకంచి శ్రీను, సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, సురేష్, ఈశ్వర్, భారతీయ జనతా పార్టీ నాయకులు చుక్కపల్లి బాలాజీ ల, ఏనుగుల వెంకటరెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, సారపాక వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.