పయనించే సూర్యుడు ఏప్రిల్ 03,(చింతకాని మండలం రిపోర్టర్. ఏర్పుల కోటేశ్వరరావు). పాతర్లపాడుగ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామసభకు సర్పంచ్ ఓబిన పోయిన లక్ష్మి అధ్యక్షత వహించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ దారెల్లి సురేష్, వార్డు సభ్యులు, స్పెషల్ ఆఫీసర్, ఏఈఓ, జీపీవో, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గౌరవ ఎస్ఐ గారు పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజల సూచనలు, అభిప్రాయాలను సేకరించి అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.