
పయనించే సూర్యడు / ఏప్రిల్ 03/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల యాక్షన్ ప్లాన్)లో భాగంగా కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆరోగ్య శిబిరాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధ, గురువారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఎన్‌సీడీ (అంటువ్యాధులు కాని వ్యాధులు) మరియు క్యాన్సర్ సంరక్షణ శిబిరాలకు విశేష స్పందన లభించింది. ఏప్రిల్ 1వ తేదీన 7 ఉప కేంద్రాల పరిధిలో నిర్వహించిన శిబిరంలో 75 మందికి స్క్రీనింగ్ నిర్వహించి, అవసరమైన వారికి అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం 2వ తేదీన కుషాయిగూడ పీహెచ్‌సీ మరియు కాప్రా పరిధిలో నిర్వహించిన శిబిరంలో 95 మందికి కంటి చూపు మరియు ఈఎన్‌టీ సంబంధిత పరీక్షలు చేశారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు క్యాన్సర్ ముందస్తు లక్షణాలను గుర్తించేందుకు వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్, డాక్టర్ సుప్రియ, ఎన్‌సీడీ సూపర్‌వైజర్ అమ్సుందర్ (ఎంపీహెచ్‌ఓ), ఎంపీహెచ్‌ఎస్ సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు తమ ఆరోగ్య పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వైద్యాధికారులు కోరారు.