
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3 నారాయణపేట జిల్లా బ్యూరో నారాయణపేట మండలంలోని బసిరెడి పల్లి గ్రామంలో 31.03.2026 నాడు అర్థరాత్రి సమయంలో ఇంటి ఆవరణలో అవ్వతో నిద్రిస్తున్న చిన్నారి 4 సంవత్సరాల తేజశ్రీ నీ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనను నిరసిస్తూ ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్, ప్రగతిశీల మహిళా సంఘం పి ఓ డబ్ల్యు, సంఘాల ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అంతకులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బసిరెడ్డిపల్లి గ్రామంలో నిరసన చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన నారాయణ పేట శివశంకర్ తో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘం పి ఓ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి లు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు, విద్యార్థినిలకు రక్షణ కరువైందని. మొన్న మద్దూరు మండలం, మోమినాపూర్ గ్రామం, పాఠశాలలోనే విద్యార్థిపై ఉపాధ్యాయుడి దారుణం మరువక ముందే బసిరెడి పల్లె గ్రామంలో నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి, హత్య చేసి పడేసి వెళ్లిన ఘటనను చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఇలాంటి సంఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో పదే పదే జరగడానికి ప్రధాన కారణం గ్రామాల్లో విచ్చల విడిగా బెల్టు షాపులు ఏరులై పారుతున్నాయి. దీని వలన మద్యం తాగినా మైకంలో తల్లి చెల్లి అక్క , చిన్న పెద్ద తేడా లేకుండా ఇలాంటి ఆగాయిత్యానికి పాల్పడుతున్నారు. దీనికి తోడుగా డ్రగ్స్ గంజాయి గ్రామీణ ప్రాంతంలో కూడా లభించడం వాటికి కొందరు యువకులు బానిసలై వాటిని సేవించిన మత్తులో ఇలాంటి దారుణాలకు ఓడిగడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం, డ్రగ్స్ గంజాయిలను నియంత్రంచాల్సిన ప్రభుత్వాలు, అధికారులు వాటి,అమ్మకాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం వలన. దీని ప్రభావం గ్రామాల్లో ఉన్న యువత విద్యార్థుల పై పడుతుంది. వాటిని సేవించిన వారు అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. అందులో భాగంగానే బసిరెడ్డి పల్లి గ్రామంలో జరిగిన సంఘటననే.ఈ దుర్మార్గపు ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలి. బాధిత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి. లేనియెడల ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (పి ఓ డబ్ల్యు)జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి,నాయకులు ఎదురింటి లక్ష్మి, ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) జిల్లా ఉపాధ్యక్షులు J రాము, జిల్లా నాయకులు కృష్ణ, సంతోష్, నబి , కాశి, బాలు, ఏఐపికేఎంఎస్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు నరహరి తదితరులు పాల్గొన్నారు.