పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్వయం పరిపాలన ప్రాముఖ్యతను వివరించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌గా బి. శ్రావణి, డీఈఓగా కే. మేఘమాల, ఎంఈఓగా భాను ప్రసాద్, హెచ్‌ఎంగా జ్ఞానేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. రాజారెడ్డి, ఉపాధ్యాయులు కే. సునీత, జె. శ్రీనివాసులు, కిరణ్మయి, టి. అరుణకుమారి, శాంతమ్మ, స్నేహలత పాల్గొన్నారు. అలాగే ఏఏపీసీ చైర్మన్ కిష్టమ్మ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.