బిజినాపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ మత్స్యకార జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల అల్లోజి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 3 బిజినాపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ పాపన్న గౌడ్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి, అణగారిన వర్గాల కోసం పోరాడిన మహావీరుడని తెలిపారు. మొఘల్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా గరిల్లా దళంతో పోరాడి, అనేక కోటలను జయించి గోల్కొండను స్వాధీనం చేసుకున్న నాయకుడిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పాపన్న గౌడ్ సేవలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు అంతటి వేణుగోపాల్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మత్స్యకార సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల అల్లోజి, గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి మల్లేష్ గౌడ్, కిరణ్ గౌడ్, భగవంతు గౌడ్, రాజేందర్ గౌడ్, వెంకట రాములు గౌడ్, అనిల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *