పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 03. చండూరు పోలీసు స్టేషన్ ఏ ఎస్సై గా శ్రీ రాములు పోలీసు స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుండి చండూరు కు ఉన్నతాధికారులు బదిలీ చేసారు. గతంలో చండూరు లోనే ఈ సందర్భంగా ఏ ఎస్సై గా శ్రీ రాములు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమా లు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఏ ఎస్సై బదిలీపై వెళ్ళారు. పోలీసు సిబ్బంది నూతన ఏ ఎస్సై శ్రీ రాములు కి శుభాకాంక్షలు తెలిపారు.