ప్రజా పాలనలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

* ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 3 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (99 రోజుల ప్రత్యేక కార్యక్రమం) లో భాగంగా గ్రామసభ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో నిరుపేదలకు 48 కుటుంబాలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇంకా ఇళ్లు లేని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. గ్రామానికి చెందిన 989 మంది లబ్ధిదారులకు ఉచిత కరెంట్ అందించామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి వారికి ఉచితంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పలు సంక్షేమ పథకాలు ఎన్నో చేసి ప్రజలకు అందిస్తుందని తెలియజేశారు. వెల్దండ మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలని గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను మండలానికి కేటాయిస్తామని హామీ ఇచ్చినందున గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, గ్రామ నాయకులు, ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వెల్దండ మండల కేంద్రానికి చెందిన సుధా సత్యనారాయణ కు 49000/- వేల రూపాయల చెక్కు ను, అన్నెపు పద్మ అనే బాధితురాలికి 19000/- వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఈ కృష్ణయ్య, డీఈ బసవలింగం, ఏడీ శంకర్, తహశీల్దార్ బిస్వ కార్తీక్ కుమార్, మండల వైద్యాధికారిణి సింధు, ఏఈ వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి గిరి గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచి యెన్నం భూపతి రెడ్డి, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలాది మల్లీశ్వరి రంగనాథం, పసునోజు వాణి పురుషోత్తం, ముదికొండ కవిత రమేష్, మారేపల్లి మంజుల శ్రీను, గుద్దటి కిస్టాల్, గోసుల కొండయ్య, మసిగుండ్ల వెంకటేష్, జంగిలి సునీత ఆనంద్, బాదేపల్లి రమేష్, పిల్లి దేవేందర్, రేవల్లి మానస రాజు, సిర్సనగండ్ల శేఖర్, రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, నాయకులు ఎండి రషీద్, తిరుపతి రెడ్డి, మండలమోని కృష్ణ, కొయ్యల పుల్లయ్య, అన్నెపు వెంకటేష్, రాజు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *