పయనించే సూర్యుడు, ఏప్రిల్ 3 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా తీమ్మినోని పల్లి, రాచూర్ తాండ కు చెందిన మూడవత్ హరికిషన్ నాయక్ నియమితులయ్యారు. గతంలో హరికిషన్ నాయక్ తల్లి రాచూర్ ఎంపీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం హరికిషన్ భార్య తిమ్మినోని పల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొంది సర్పంచిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కి నమ్మినబంటుగా హరికిషన్ నాయక్ రాజకీయాలలో కొనసాగుతున్నారు. మండలంలో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే ఎస్టీ లకు ఇవ్వాలనే ఆలోచనతో హరికిషన్ నాయక్ ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హరికిషన్ నాయక్ మాట్లాడుతూ ఎమ్మె ల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలో పేతానికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అందర్నీ కలుపుకొని ముందుకు సాగుతానని ఈ సందర్భంగా తెలిపారు.