సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అధ్యక్షతన..

అన్నారుగూడెంలో ఘనంగా జరిగిన గ్రామసభ * పలు కీలక విషయాలపై ఉన్నతంగా సమీక్షా...

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 4, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అధ్యక్షతన గ్రామసభ గురువారం ఘనంగా జరిగింది. ఈ గ్రామసభలో పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మూడు నెలల కాలంలో గ్రామంలో పారిశుద్ధ్యం, ఎలక్ట్రిసిటీ,డ్రైనేజీలు ప్రతి సమస్య కూడా చాలావరకు పురోగతిని చెందాయని స్థానిక ప్రజలు గ్రామసభలో సంతోషం వ్యక్త పరిచారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారు చేస్తారని బలమైన విశ్వాసం మా కుందని సభలో ప్రజలు ముక్తకంఠంతో చెప్పడం చాలా సంతోషంగా ఉందని స్పెషలాఫీసర్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రధానంగా సమస్యలపై అవగాహన ఉన్న యువకునికి సర్పంచ్ గా అవకాశం రావడం సర్పంచ్ ను మంచి గైడ్ చేస్తూ పాలనలో విశేష అనుభవం ఉన్న నాయకులు తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అదే విధంగా స్థానిక ఉప సర్పంచ్, అడ్మినిస్ట్రేషన్ మేకర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు తనదైన శైలిలో పంచాయతీని ప్రగతి బాటలో నడిపిస్తున్నారని స్పెషల్ ఆఫీసర్ ఏవో తాజుద్దీన్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు,ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, వార్డు మెంబర్స్, ప్రజా ప్రతినిధులు రాచ బంటి వంశీ, గడేసుల ఆనందరావు, శ్రీలత, సూధా హనుమంతరావు, నాయకులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు,పొన్నం కృష్ణయ్య, మారెళ్ళ దేవేందర్, పేరసాని నరసింహారావు, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, అధికారులు ఏవో తాజుద్దీన్,సెక్రెటరీ వెంకటేశ్వరావు, వైద్యాధికారి, ఎలక్ట్రిసిటీ అధికారులు, ఐకెపి సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, మల్టీపర్పస్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ,మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *