పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) జనగామ జిల్లా దేవరుప్పుల మండలం,చిన్నమాడూరు గ్రామంలో గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా చిన్నమడూరు వాగు నుండి మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు అక్రమంగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో ఇసుక తరలించారని,ఆ ఇసుకను గ్రామ సర్పంచ్ మైదం జోగేశ్వర్ ఆదేశాల మేరకే తరలించానని ట్రాక్టర్ డ్రైవర్ కంకటి శ్రీను తెలుపగా గ్రామ సర్పంచ్ మైదం జోగేశ్వర్,ట్రాక్టర్ డ్రైవర్ కంకటి శ్రీనులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ మహమ్మద్ అశ్వక్ అహ్మద్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఊర సృజన్ కుమార్ తెలిపారు.ప్రభుత్వ నిబంధనలు విస్మరించినా,అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినా వారు ఎవరైనా,ఎంతటి వారైనా వారికి చట్టరిత్యా చర్యలు తప్పవని ఎస్ఐ సృజన్ తెలిపారు.