తిరుమలగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం బ్రహ్మోత్సవాలలోపట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , శ్రీదేవి (అమ్మాజీ) దంపతులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 4 జగ్గయ్యపేట మండలం, తిరుమలగిరి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా 02.04.2026 గురువారం రాత్రి నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , శ్రీదేవి అమ్మాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి గ్రామ ప్రముఖులు, నాయకులు, దేవస్థాన కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *