పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్ పట్టణంలోని మోమిన్‌పుర వీధిలో మిషన్ భగీరథ తాగునీటి పంపిణీ వ్యవస్థను ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ స్థానిక 8వ వార్డ్ సభ్యుడు సౌకత్ అలీతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు ప్రాంతాన్ని సందర్శించి పైపులైన్ల పరిస్థితి నీటి ఒత్తిడి సరఫరా సమయాలపై సమీక్ష నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఎక్కడైనా లీకేజీలు లేదా అంతరాయాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు డీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సచిన్ గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.