బసాపురం ఎస్ ఎస్ ట్యాంకును మరియు కాలువను పరిశీలించిన.

కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. తుంగభద్ర కాలువ నుంచి మరి మూడు రోజుల్లో ఆదోని కి నీరు వస్తున్న సందర్భంగా ఈ రోజు ఆదోని పట్టణంలో బసాపురం ఎస్‌ఎస్ ట్యాంక్‌ను మరియు కాలువను పరిశీలించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ రాబోయే ఎండాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగినంత తాగునీటి సరఫరా కొనసాగించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ట్యాంక్ పరిస్థితిని సమీక్షించి, అవసరమైన మరమ్మత్తులు మరియు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారూ.ఈ కార్యక్రమంలో ఎల్ ఎల్ సి చైర్మన్ బసాపురం రామస్వామి, ఈ ఎక్స్ ఎంపీపీ మురళి, వడ్డేమాన్ గోపాల్, కల్లుబావి మల్లి, బైచిగేరి ఓంకార్, సాదిక్ వలి, రాఘవరెడ్డి, రాజశేఖర్,దేవేంద్ర, చిన్న చిట్టి, భరత్, బాబురావు, వీరేష్, కుప్పగళ్ళు హనుమంతు, మరియు గ్రామ ప్రజలు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *