హైదరాబాద్‌లో ఏప్రిల్ 6న గద్దర్ ఫౌండేషన్ రాష్ట్ర స్థాయి సభ

"దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ పిలుపునిచ్చారు"

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 రాజేష్ దౌల్తాబాద్) హైదరాబాద్: ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ స్ఫూర్తితో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలు” అనే అంశంపై రాష్ట్ర స్థాయి సభను ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ జిల్లా రాయపోల్‌లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలలో గద్దర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి సంవత్సరం గద్దర్‌పై కాల్పులు జరిగిన రోజున గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ రోజును “గద్దర్ పునర్జన్మ దినం”గా కూడా పాటిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 6న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, ప్రజా సంఘాల నాయకులు పుట్ట రాజు, సతీష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *