ఘనంగా రథోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 04 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోని గుట్టపై ఉన్న చారిత్రక రామాలయంలో నిన్న అర్ధరాత్రి నుంచి శుక్రవారం భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు తాట్లవాయి రామాలయం గుట్ట క్రింద జరిగే రథోత్సవం ఘనంగా నిర్వహించారు బ్రాహ్మణోత్తముల వేదమంత్రాల సాక్షిగా శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ ఉత్సవ విగ్రహాలను అశ్వా శావా పై భక్తులు భజనలతో ఆలయ నుండి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి రథం పై శ్రీరాముల వారి సకుటుంబ ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఆలయ ప్రాంగణం చుట్టూ రథోత్సవం నిర్వహించగా భక్తులు తాట్లవాయి రామస్వామి గోవిందా అనే నామస్మరణతో రథోత్సవం ఘనంగా నిర్వహించారు జగిత్యాల, నిర్మల్, కరీంనగర్ మంచిర్యాల్ తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల మల్లేశం,ఉప సర్పంచ్ మారుపాకనారాయణ, పండితులు శ్యామ్ సుందర్ ఆచార్యులు ,రంగా ఆచార్యులు ధృవ చార్యులు , మురళి ఆచార్యులు, మనోహర ఆచార్యులు, మదన్మోహన్ ఆచార్యులు మాజీ సర్పంచ్ కొసరి మహేష్ పాలకవర్గం రాజోళ్ళ లాహిరి మహిపాల్,చుక్క పెద్దులు యమశ్రీ వేంకటి సురేష్,గంగాధర్ తదితర గ్రామల ప్రజా ప్రతినిధులు ,వేలాది భక్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *