ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ చట్టంచారిత్రాత్మకం

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు

పయనించే సూర్యుడు , కోరుట్ల, ఏప్రిల్ 04: ( చింతోజి రాధాకృష్ణ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఆమోదం పొందిన ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ జవాబుదారీ తనం బిల్లు -2026 చారిత్రాత్మకం అని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు అన్నారు తల్లిదండ్రుల పోషణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా శుక్రవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ అధ్యక్షులు పబ్బా శివానందం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ చట్టం -2026 బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతల తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి సామాజిక భాద్యత తోనే ఈ బిల్లు సాధ్యమైనదని కొనియాడారు సీనియర్ సిటిజన్స్ కు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు సీనియర్ సిటిజన్స్ కోరిక మేరకు ప్రహరీ గోడ నిర్మాణం కోసం స్పెషల్ డెవలప్మెంట్ నుండి 3 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని అందుకు సంబంధించిన ప్రోసిడింగ్ పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్స్ కు ఏ సమస్య వచ్చినా తమ నాయకుల దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా శ్రేయస్సు అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంరక్షణ చట్టం -2007 దీనికి తోడుగా అసెంబ్లీ లో అ మోదించిన ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ బిల్లు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ బిల్లు ఆమోదంతో వృద్ధుల ఆశీస్సులు సీఎం రేవంత్ రెడ్డి పై ప్రభుత్వం పై ఉంటాయన్నారు. ఇట్టి చట్టంతో ఉద్యోగుల ఉపాధ్యాయుల అధికారుల తల్లిదండ్రులకు సత్వర న్యాయం జరుగుతుందని అలాగే అమ్మా నాన్నలను పట్టించుకోని అన్ని వర్గాల కొడుకులకు కూతుర్లకు వారసులకు సైతం సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమ అసోసియేషన్ తరపున కోరారు. ఈకార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు పిసి హన్మంత్ రెడ్డి ఎండి యాకూబ్ కోరుట్ల డివిజన్ అధ్యక్షులు పబ్బా శివానందం వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక గంగారాం కోశాధికారి నల్ల లక్ష్మి నారాయణ ఉపాధ్యక్షులు ఎండి సైఫోద్దీన్ రాజయ్య వెంకటేశ్వర రావు మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ చైర్మన్ లు అన్నం లావణ్య,అనిల్,శీలం వేణు గోపాల్,గడ్డమీది పవన్ కోరుట్ల డివిజన్ కార్యవర్గ సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులు కోరుట్ల కథలాపూర్ మేడిపల్లి మండలాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *