పయనించే సూర్యుడు న్యూస్: ఏప్రిల్/04 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పెళ్లి సత్యనారాయణ, ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మెన్ బండారిపల్లి లక్ష్మణ్ ను మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. శుక్రవారం కరీంనగర్ లోని లక్ష్మణ్ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్ ను పరామర్శించిన వారిలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కంది అశోక్ రెడ్డి, ఊట్కూరి వెంకటరమణారెడ్డి, నాగరాజు తదితరులు ఉన్నారు. నుస్తులాపూర్ లో తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ దాబా ను మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాబా నిర్వాహకుడు నందికొండ శేఖర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారు రమేష్, పార్టీ నాయకులు మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, బుదారపు శ్రీనివాస్, ఎస్ కొండలరావు, గోగూరి నరసింహారెడ్డి, పొన్నాల చిరంజీవి, ద్యావ శ్రీనివాసరెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, సంగు వేణు, నందికొండ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొగిలిపాలెంలో… తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త దుడ్డెల రాజమల్లు-విజయ దంపతుల కుమార్తె మనీషా వివాహానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్, మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి,పార్టీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, లింగయ్య, శ్రీనివాస్, రాజిరెడ్డి, మల్లయ్య, రమేష్, రవి, కిరణ్ కుమార్, సతీష్ రెడ్డి, జనార్దన్ రావు తదితరులు ఉన్నారు. వల్లంపట్లలో ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎలగందుల బాలయ్య మనవడు కార్తీక్ వివాహానికి హాజరై ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ఊట్కూరి వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, వల్లంపట్ల సర్పంచ్ నేరెళ్ల విజయ్ గౌడ్, ఉప సర్పంచ్ కె. రాజు, పార్టీ నాయకులు మేకల శ్రీనివాస్, గజ్జల రాజశేఖర్, ఎలుక అనిల్ కుమార్, బంగారు ఆంజనేయులు నాగరాజు తదితరులు ఉన్నారు.