సాలూరలో ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు.

* మహనీయుడికి నివాళులు అర్పిస్తున్న నేతలు.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 4 బోధన్:సాలూర మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకలను మండల నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ తొలి అమరుడు నిజాం దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎనలేని పోరాటాలు చేసి బానిస సంకెళ్ల నుండి విముక్తి కల్పించి బడుగు బలహీన వర్గాల రైతాంగ పోరాట యోధులుగా చరిత్ర సృష్టించిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు ఆయన సాహసాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు సొక్కం లావణ్య రవి,చింతం నాగయ్య,నూర్ హైమద్,నాయకులు రావుబా గంగధర్ మేడి రవి దేవారావు ఉపసర్పంచ్ చిద్రపు శ్రీనివాస్ ఇల్తెపు గంగారం సాలెన్ సంజీవ్ శెట్టి గొండ రమేష్ దేవేందర్ భూమయ్య సురేష్ సాయికుమార్ శ్రీనివాస్ సిద్ధుగొండ కురుమ కులస్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *