
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 04 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి(ఎస్ఎంకుమార్) అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(ఏ ఐ ఎఫ్ డి ఏస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ సంద ర్భంగా పల్లె మురళి* మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఫీజు బకాలపై ఇచ్చిన తీర్పులో విద్యార్థుల నుండి వసూలు చేసుకుని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి విద్యార్థులకు చెల్లించా లని తీర్పు సరైనది కాదని ఇది విద్యా ర్థుల చదువుల అభివృద్ధికి గొడ్డలిపెట్టా ని హైకోర్టు తీర్పు ను పున:సమిక్ష చేయా లని అఖిలభా రత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(ఏ ఐ ఎఫ్ డి ఏస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరుతున్నది ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకం అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నారని అలాంటి ది ప్రైవేటు యజమాన్యాల బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభు త్వానికి ఆదేశాలు ఇవ్వ కుండా విద్యా ర్థుల నుండి వసూలు చేసుకోండి అనే తీర్పు సరైనది కాదు అ అణగారిన వర్గాల నుండి ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్న ప్రధానంగా ఈ ఫీజులు పొందే వారు పేద విద్యార్థు లు వారిలో రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారని వారు ఈ తీర్పు వలన మరింత ఇబ్బందులకు గురి అవుతారని ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు యజమాన్యాలు ఫీజు బకాయిలు రావ డంలేదని పేద విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తు న్నారని దీనివల్ల గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వారు అన్నారు ప్రభు త్వం తక్షణమే రాష్ట్రంలో పెండింగ్ లొ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాల ర్షిప్స్ విడుదల చేసి సమస్య పరిష్కారా ని కి కృషి చేయా లని రాష్ట్ర ప్రభుత్వా న్నిఏ ఐ ఎఫ్ డి ఏస్ డిమాండ్ చేస్తుంది. హైకోర్టు తీర్పును పున: సమీక్షింఛి ప్రభుత్వానికి తక్షణమే ఫీజు విడుదల కోసం ఆదేశాలు ఇవ్వాల ని కోరుతుంది.