పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ మహాలింగ ఆర్ కళ్యాణదుర్గం: ప్రముఖ సేవా సంస్థ ఆ డి టి కి సంబంధించి ఎఫ్ సి ఆర్ ఏ రెన్యూవల్ ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేక చొరవ చూపిన కూటమి అగ్రనేతలకు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు హెచ్. అనిల్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధికి పెద్దపీట ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి, సామాజిక సేవా సంస్థల బలోపేతానికి అండగా నిలుస్తున్న నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా: పవన్ కళ్యాణ్ (ఉప ముఖ్యమంత్రి) నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి) నారా లోకేష్ (రాష్ట్ర మంత్రి) వీరి సమిష్టి కృషితోనే పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలు పరిష్కారమవుతున్నాయని కొనియాడారు. సేవలకు మార్గం సుగమం గత కొంతకాలంగా సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. ఆడిటి వంటి సంస్థలకు నిధుల సేకరణ సులభతరం కావడం వల్ల క్షేత్రస్థాయిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు మార్గం సుగమం అయిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధత అభినందనీయమని ఆయన అన్నారు. పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు జనసేన పార్టీ కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు పాళ్యం అనిల్ కుమార్, జనసేన నాయకులు శ్రీనివాసులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.