దేవరకొండ కోర్టును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు శనివారం దేవరకొండ కోర్టును సందర్శించారు. వేసవి దృష్ట్యా బార్ అసోసియేషన్, బీఎస్ఎన్ఎల్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో న్యాయవాదుల కృషిని అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె.అనిత, జూనియర్ సివిల్ జడ్జి కె.వి. హరీశ్ బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *