జహీరాబాద్‌లో ‘రన్ ఫర్ జీసస్’ ప్రదర్శన: జెండా ఊపి ప్రారంభించిన శాసనసభ్యులు మాణిక్ రావు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 :(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు )
క్రైస్తవ సోదరుల ఐక్యతకు చాటుతూ నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం జహీరాబాద్ పట్టణంలో అత్యంత ఉత్సాహంగా సాగింది. స్థానిక క్రైస్తవ ప్రార్థనా మందిర మైదానం వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాణిక్ రావు మాట్లాడుతూ, క్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. లోక రక్షకుడైన క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రేమ, సహనం, సమాధానం కలిగి ఉండాలని కోరారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ మార్గమధ్యలో రచ్చన్నపేట్ పురపాలక సంఘం సభ్యురాలు స్రవంతి రవికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీరు, పానీయాల పంపిణీ కేంద్రాన్ని శాసనసభ్యులు సందర్శించి, వారి సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యురాలు స్వప్న భాస్కర్, నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, పట్టణ అధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *