పయనించే సూర్యుడు ,ఏప్రిల్ 05 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక ఏజెన్సీ ప్రాంతంలో టాటా క్యాపిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు వివాదాస్పదంగా మారాయి. ప్రైవేట్ వ్యక్తులు రెవెన్యూ, గ్రామపంచాయతీ అనుమతులు లేకుండానే వ్యాపారాన్ని నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఆర్బిఐ నియంత్రణలో ఉంటాయి, కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక అనుమతులు అవసరమని పంచాయతీ చెబుతోంది.భద్రాచలం రాజీవ్ నగర్‌కు చెందిన మహిళ ఓటర్ ఐడీలో పుట్టిన తేదీ (01/01/1900) మార్చి లోన్ క్యాన్సిల్ చేసిన విషయాన్ని వెల్లడించింది. వైఓపి2157394 ఐడీతో సంబంధం ఉన్న సూర్య కుమారి గుడాల పేరు మార్పులు, భర్త సోమ శేఖర రావు గుడాల వివరాల మార్పు గమనార్హం. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇటువంటి మార్పులు చట్టవిరుద్ధం, టాటా మైక్రో ఫైనాన్స్ అధికారులను అడిగినప్పుడు, ఏజెన్సీ ఏరియాలో ఫైనాన్స్ నడపడానికి లోకల్ పర్మిషన్ అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఆర్బిఐ ప్రకారం ఎన్బిఎఫ్సి లు దేశవ్యాప్తంగా పనిచేస్తాయి, కానీ గిరిజన ప్రాంతాల్లో కలెక్టర్ లేదా స్థానిక అధికారుల అనుమతి కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అయినప్పటికీ ఫైనాన్స్ అధికారులు మాత్రం ఎటువంటి పర్మిషన్ లేదన్నటంలో స్థానికుల ఆగ్రహాన్ని మరింత పెంచింది.సారపాక గ్రామపంచాయతీ సెక్రటరీ లిఖితంగా వివరణ కోరి, తహసీల్దార్ అనుమతి తప్పనిసరని తెలిపారు. శనివారం అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు పంచాయతీలో స్థానిక మీడియాపై వాదించారు. ప్రైవేట్ వ్యక్తుల బెదిరింపులు, స్థానిక నాయకులపై జులుం కొనసాగుతోందని ఆరోపణలు.టాటా క్యాపిటల్ సారపాక శాఖ ఉన్నప్పటికీ, అనుమతుల లోపం వల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయి. స్థానికులు బూర్గంపాడు తహసీల్దార్, భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానిక మీడియా ద్వారా ఈ అంశం హైలైట్ అయినా, పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది.