పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 6 యడ్లపాడు మండల ప్రతినిధి.. బోయపాలెం మరియు వంకాయలపాడు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు వంకాయలపాడు గ్రామ పంచాయతీ మాజీ ఎంపీటీసీ వంకదారి శ్రీనుబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యేసు క్రీస్తు పునరుత్థానానికి సంకేతమైన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలను, శాంతిని నింపాలని ఆకాంక్షించారు. క్రీస్తు బోధించిన ప్రేమ, క్షమాగుణం, త్యాగం వంటి విలువలు మనందరికీ ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే, ఈ పవిత్ర ఈస్టర్ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.