పయనించే సూర్యుడు 6/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె. విజయబాబు స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతికి వారు అందించిన సేవలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా వారి పోరాటం కొనసాగిందని తెలిపారు. రక్షణ, వ్యవసాయ, కార్మిక వంటి కీలక శాఖలకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, స్వాతంత్ర్యానంతర స్వయంపాలనలో దేశ ప్రగతి కోసం తనవంతు కృషి చేశారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి వంటి పదవులతో నాటి ప్రభుత్వంలో ఎస్సీ (మాదిగ) కుల నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని సండ్ర వెంకట వీరయ్య గుర్తుచేశారు. దళితుల సాధికారత కోసం కెసిఆర్ ప్రభుత్వము లో దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాన్ని అమలు చేయడంలో బాబూ జగ్జీవన్ రామ్ ఆలోచనల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని సండ్ర అన్నారు. దళిత బహుజన కులాలకు రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబూ జగ్జీవన్ రామ్ కి మనం అందించే ఘన నివాళి అని సండ్ర తెలిపారు