అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

అనపర్తిలో మిన్నంటిన కూటమి శ్రేణుల సంబరాలు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 06 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని అనపర్తి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. రాజధానిగా అమరావతికి లైన్ క్లియర్ కావడంతో స్థానిక కూటమి శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాయి.భారీ ర్యాలీ – కిక్కిరిసిన వీధులు:స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డిల ఆదేశాల మేరకు అనపర్తి పట్టణంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ప్రధాన కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.క్యాండిల్ మార్చ్ మరియు కేక్ కటింగ్:బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కూటమి శ్రేణులు పట్టణంలో ఘనంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అమరావతి విజయానికి చిహ్నంగా బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ విజయం కేవలం ఒక ప్రాంతానిది కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ విజయమని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.పార్లమెంట్‌లో మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు: అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు పలికిన అన్ని రాజకీయ పార్టీలకు అనపర్తి కూటమి శ్రేణులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాయి. ఐదేళ్ల అనిశ్చితికి తెరపడిందని, ఇకపై అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి అమరావతే దిక్సూచి అని, కేంద్ర ప్రభుత్వం మరియు మద్దతు తెలిపిన పార్టీల సహకారం చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *