బాబుజి స్ఫూర్తి స్థిరస్థాయిగా నిలిచేలా.. గుడ్లనర్వలో జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 6 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లెట్ల బాలస్వామి, ఉప సర్పంచ్ దాసరి శివప్రసాద్, వార్డు సభ్యులు లెట్ల శివకృష్ణ, లెట్ల భీమారావ్ పాల్గొన్నారు. అలాగే గ్రామ యువకులు రెడ్డిపాకుల శ్రీశైలం, కొమ్ము రాజు, లెట్ల వేణు తదితరులు హాజరై జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *