తిరుపతి రుయాలో రూ.50వేల ఇంజెక్షన్ ఫ్రీ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం. చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయాలి. తిరుపతి రుయాలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మంగళ, శుక్రవారం న్యూరాలజీ ఓపి ఇస్తారు. అత్యవసర వైద్యం 24గంటలు అందిస్తారు. చేయి, కాలు, మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కళ్లు కనిపించకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. సకాలంలో గుర్తించి ఇక్కడికి తీసుకొస్తే రూ.50వేల విలువైన ఇంజెక్షన్ వేస్తారు. 90శాతం ప్రాణాపాయం తప్పుతుంది. గమనిక ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి లేదా మీ వారికి పోస్ట్ చేయండి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *