డిసిఎం డ్రైవర్ నిర్లక్ష్యంగానడిపి మహిళ మృతికి కారణమైన అతనిపైకేసు నమోదు చేసినట్లుపోలీసులు తెలిపారు.

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 06 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) అబ్దుల్ బాసిత్, తండ్రి అబ్దుల్ మజీద్, వయస్సు 26 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి (మలబార్ గోల్డ్, మహేశ్వరం), నివాసం: మైత్రి కుటీర్, మహేశ్వరం, స్వస్థలం, కేరళ, ఇతను 23-11-2025 తేదీన తన స్వగ్రామంలో హనియా అయేషా (భార్య), వయస్సు 22 సంవత్సరాలు, తో వివాహం చేసుకుని హైదరాబాద్‌కు వచ్చి, మలబార్ ఫ్యాక్టరీలో ఎక్స్‌పోర్ట్ ఇన్‌చార్జ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 04-04-2026 తేదీన వీరు కుకట్‌పల్లి లేక్‌షోర్ మాల్‌లో “వాజ్హా 2” సినిమా చూడటానికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో తమ రెండు చక్రాల వాహనం (నంబర్: కేఎల్ 14 ఏబి 1196) పై వస్తుండగా, మైండ్‌స్పేస్ గేట్‌కు ముందు ఉన్న అండ ర్‌పాస్ వద్ద, కే ఏ ఓ ఏ ఎల్ 6042 నంబర్ గల డీసీఎం వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా వాహనం నడిపి రాత్రి సుమారు 11:30 గంట లకు వీరిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని భార్య హనియా (మరణించినది) తీవ్రంగా గాయపడి, ఏఐజి ఆసుపత్రికి తరలించగా డ్యూటీ డాక్టర్ ఆమెను మృతిగా ప్రకటించారు. పిటిషనర్‌కు ఎడమ చేతిపై ఇతర శరీర భాగాలపై గాయాలు అయ్యాయి.కాబట్టి, డీసీఎం వాహనం డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *