పయనించే సూర్యుడు మార్చి 7 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ స్థానిక శ్రీ ఆంజనేయ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక సేవలో భాగంగా ఒక విశేష కార్యక్రమం జరిగింది. ఇడం స్వరూప స్మారక సేవా సంస్థ ఆధ్వర్యంలో వెల్లంకి గ్రామ సర్పంచ్, దేవరకొండ వాసి అయిన ఇడం రాధా శ్రీనివాస్ ఆలయ అవసరాల నిమిత్తం మూడు ఆయిల్ కాటన్లను విరాళంగా అందజేశారు.గ్రామ అభివృద్ధిలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ వారు చూపుతున్న చొరవను అభినందిస్తూ దేవాలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులకు శాలువా కప్పి, దేవాలయ జ్ఞాపికను (మెమెంటో) బహుకరించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సీరందాస్ వెంకటేశ్వర్లు, అప్పం అజయ్, ముస్ని రమేష్, ఈడం రవి, పులిజాల వెంకటేశ్వర్లు, ఈడం రాములు, కుకూడాల మార్కొండయ్య, భూషరాజు రాములు మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.