నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందడుగు

పయనించే సూర్యుడు: 07-04-2026 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె.విజయబాబు నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందడుగు స్వయంగా ట్రాక్టర్ నడిపి నీటి సరఫరా చేసిన సర్పంచ్ గాయం రమేష్ మండాలపాడు గ్రామ పంచాయతీ మాలపల్లిలో గత రెండు రోజులుగా బోర్ మోటార్ మరమ్మతులకు గురికావడంతో గ్రామస్థులకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది ప్రజల ఇబ్బందులను గమనించిన గ్రామ సర్పంచ్ గాయం రమేష్ తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు రెండు వాటర్ ట్యాంకర్ల ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేయించారు ఈ క్రమంలో సర్పంచ్ కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఇంటింటికి వెళ్లి ప్రజలకు నీటిని అందించడం విశేషం. ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ”బోర్ మోటార్ చెడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశాము. మోటార్ మరమ్మతులు త్వరగా పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తాం” అని హామీ ఇచ్చారు. సర్పంచ్ స్వయంగా శ్రమించి నీటిని సరఫరా చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, మండాలపాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *