పాలకుర్తి లో ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ( జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాలను ఎగరవేసి ఘనంగా నిర్వహించటం జరిగింది మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులు మారం రవికుమార్ పార్టీ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మారం రవి కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తొలినాళ్లలో పార్లమెంటులో కేవలం రెండు సీట్లు ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ భాజపాను హేళన చేస్తూ ఈ రెండు సీట్లతో మీరు ఏం సాధిస్తారు అని మాట్లాడిన సందర్భంలో అప్పటి భాజపా నేత అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడుతూ ఈరోజు మేము కేవలం రెండు సీట్లు ఉన్నాం కావచ్చు కానీ ఏదో ఒక రోజు మా శిష్యులు వస్తారు మేము మీ స్థానం లకు, మీరు మా స్థానంలకు వచ్చేందుకు పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేస్తారని చెప్పడం జరిగిందని వారి మాటకు తగ్గట్టుగానే రోజురోజుకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూ, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం గా కాకుండానే అత్యధిక స్థానాలతో పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా ఉంటూ అధికారాన్ని చేపట్టిందని రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలో కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదని, ప్రజాస్వామ్య యుతంగా పార్టీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముందుకు పోయే పార్టీ అని రోజురోజుకు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెరుగుతున్నారు తప్ప తగ్గలేదని అన్ని వర్గాల ప్రజలు భాజపాను ఆదరించాలని రానున్న రోజుల్లో దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మంచినీళ్ల ఉపేందర్ రెడ్డి, జిల్లా నాయకులు కడుదుల నిరంజన్ రెడ్డి, ,మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజ్, ఉపాధ్యక్షులు పబ్బా సంతోష్, సీనియర్ నాయకులు దేవసాని కృపాకర్, నునావత్ శంకర్, సోషల్ మీడియా కన్వీనర్ బానోత్ చందు, చిక్కుడు అశోక్, మొగిలి వంశీ, కేరళ కరుణాకర్, వేమునూరి శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *