పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ఆదోని రూరల్ రిపోర్టర్. అనంతరం డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డి.ఎస్.ఎఫ్) ఆఫీస్ నందు ప్రెస్ మీట్.ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ… ఆదోని పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అక్రమంగాముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వచ్చే అకాడమీకేర్ అడ్మిషన్లు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలు గుర్తింపు రద్దు చేయాలి. విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ముందస్తుగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. అని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము.. వచ్చే అకాడమీ కేర్ అడ్మిషన్లు ఏ విధంగా ముందస్తుగానే నిర్వహిస్తారని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తున్నాము… ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.ఏ పాఠశాల అయితే ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారో, ఆ పాఠశాలల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఉన్నత విద్యాశాఖ అధికారులకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఎఫ్ నాయకులు మహేష్, అరవింద్, విక్రమ్, హనుమేష్, రమణ తదితరులు పాల్గొన్నారు