సర్పంచ్ కావలి రామకృష్ణ చొరవతో పాత బోరుకు పునర్జీవం

* 4వ వార్డులో కొత్త మోటారు ఏర్పాటుతో పుష్కలంగా నీటి సదుపాయం * సర్పంచ్ కావలి రామకృష్ణ , వార్డు మెంబర్ రాచమల్ల యాదగిరి కి వార్డు సభ్యుల  కృతజ్ఞతలు * గ్రామ అభివృద్ధిలో భాగస్వాములవుదాం: సర్పంచ్ కావలి రామకృష్ణ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 07, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్  మండల కేంద్రం రాజాపూర్ లో  ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా రాజాపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ , 4వ వార్డు మెంబర్ రాచమల్ల యాదగిరి ఆధ్వర్యంలో పాత బోరుకు పునర్జీవం పోశారు. గ్రామంలోని పాత బోరు చాలా కాలంగా పనిచేయకపోవడంతో వార్డు సభ్యులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బోరును ఆధునిక పద్ధతిలో శుభ్రం చేయించి, అందులో కొత్త విద్యుత్ మోటారును అమర్చారు. మోటారును బిగించిన అనంతరం  సర్పంచ్ కావలి రామకృష్ణ మాట్లాడుతూ: “గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తమ పాలకవర్గం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ప్రజలకు తాగునీటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని” తెలిపారు.తమ వార్డులో నీటి సమస్య తలెత్తకుండా, తక్షణమే పరిష్కరించినందుకు వార్డు ప్రజలు సర్పంచ్‌కు , వార్డు మెంబర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ , వార్డు మెంబర్ తో పాటు , వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు,యువకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *