పయనించే సూర్యుడు : ఏప్రిల్ 7 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండలా రిపోర్టర్ రేవల్లి కృష్ణ బాలానగర్ మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ సమీనా జమీర్ పాషా అలాగే పాలకవర్గం సమక్షంలో త్రాగునీటి కొరతను తీర్చిన అక్మే సోలార్ యాజమాన్యం గత పాలకులు పట్టించుకోకపోవడంతో త్రాగునీరుతో ఇబ్బంది పడిన గ్రామస్తులు సర్పంచ్ పాలక వర్గం సభ్యులు సోలార్ యజమాన్యంతో మాట్లాడి వాటర్ ప్లాంట్ తీసుకొచ్చారు ఇంతకుముందు తాగడానికి నీరు లేక పక్క గ్రామమైన గుండెడు నుంచి తెచ్చుకునే వాళ్లు లేదా వాళ్లు తెస్తే గాని నీళ్లు ఉండకపోయేవి అటువంటిది మన గ్రామంలో త్రాగునీరు సదుపాయం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో గ్రామపంచాయతీ భూములు సోలార్ యాజమాన్యానికి లేకపోయినా అడగంగానే ముందుకు వచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన సోలార్ యాజమాన్యానికి సర్పంచ్ పాలకవర్గమ్ కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పాలకవర్గం ఆక్మే సోలార్ యాజమాన్యం గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు