పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 07 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పల్లికొండ లత నరేందర్ ల కూతురు వైశాలి యువతి వివాహానికి చేయుతగా ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో సోమవారం వివాహ సమయానికి గ్రామంలోని సేవా భావం ఉన్న ప్రజలు గ్రామ వాట్స్అప్ గ్రూప్ లో తెలుపగానే తమవంతుగా వారికి తోచినంత ఆర్థిక సాయం చేయగా మొత్తం 18516 రూపాయలు జమ చేసిన రూపాయలు సోమవారం రోజు వివాహ సమయానికి వారి కుటుంబ సమక్షంలో యువతికి అందించడం జరిగింది. అదే విధంగా గ్రామంలోని కొందరు యువకులు ఒక గ్రూప్ యుండి వారు కూడా వైశాలి వివాహానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు . ఇందుకు యువతి వైశాలి, తల్లిదండ్రులు మాట్లాడుతూ నా కుటుంబ పరిస్థితులను చూసి నాకు సహాయం చేయాలని గొప్ప మనసుతో సహాయం చేసినటువంటి నా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తెలిపారు . ఇట్టి కార్యక్రమంలో తమవంతుగా సహాయం చేసిన సేవా భావం ఉన్న గ్రామ ప్రజలు పాల్గొన్నారు.