పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని పెద్ద మసీదు లో జరిగిన అక్రమాలను సరిచేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు సోమవారం వక్ఫ్ బోర్డు అధికారితో కలిసి ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ జామియా మసీదు ఆస్తులపై వివాదం తలెత్తింది. మసీదు ఆస్తుల నుండి వచ్చే ఆదాయాన్ని అక్రమంగా వినియోగిస్తున్నాడని సౌదీ రౌఫ్పై స్థానిక ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు సౌదీ రౌఫ్ చేస్తున్న అక్రమాలను త్వరలోనే బయటపెడతాం. జామియా మసీదు ఆస్తులు విస్తారంగా ఉన్నాయి. ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దోచుకుంటున్నాడు అంటూ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు.