భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు , 07 ఏప్రిల్ 2026, భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి, నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ పట్టణంలో సోమవారం రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ గోదావరి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, మండల అధ్యక్షుడు అరె రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యోగేశ్వర్ నరసయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు బండారి లక్ష్మణ్ గౌడ్, బిజెపి కౌన్సిలర్ అభ్యర్థులు, పట్టణ ప్రధాన కార్యదర్శులు నవీన్, దయ ప్రవీణ్, మండల బీజేవైఎం అధ్యక్షుడు శెట్టి ప్రేమ్‌చంద్, రైతు అధ్యక్షుడు తోట గంగాధర్ పాల్గొన్నారు. అలాగే నవీన్, గంగాధర్ గౌడ్, హరిప్రసాద్, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *