నాగులవంచలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – జెండా ఆవిష్కరణ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 07 ,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భాజపా మండల అధ్యక్షుడు కొండా గోపి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా గోపి మాట్లాడుతూ, 1980 ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ స్థాపించబడిందని తెలిపారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయులు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, తమ త్యాగాలతో పార్టీ బలోపేతానికి కృషి చేశారని గుర్తుచేశారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు గెలిచిన బీజేపీ, అనంతరం అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్.కే. అద్వానీ నాయకత్వంలో 1996 నుండి 2004 మధ్యకాలంలో కేంద్రంలో మూడు సార్లు అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుండి వరుసగా స్పష్టమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ దేశ అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు.బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని, కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో భవిష్యత్తు ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు ఇమ్మడి సత్యనారాయణ, గోదా మంగయ్య, సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను, మద్దినేని వెంకటేశ్వర్లు, చెన్నూరి నాగచారి, జిల్లా కౌన్సిలర్ నెంబర్ ఆవులూరి శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ సిద్దు మియా, ఉపాధ్యక్షులు బక్క సత్యమూర్తి, వేముల ఎల్లయ్య, దేశిన్ని గోపాల్ రావు, బల్లి పిచ్చా రావు, చింతల తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *