పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా మంచిర్యాలలో సోమవారం రోజున జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ప్రాంతాలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సమావేశానికి శ్రమ శక్తి అవార్డు గ్రహీత తెలంగాణ ఉద్యమ నాయకుడు 50వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పెట్టం లక్ష్మణ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ వివరాలు అధ్యక్షుడు: గజ్జెల్లి వెంకటయ్య,
గౌరవ అధ్యక్షుడు: రాళ్లబండి రాజన్న ప్రధాన కార్యదర్శి: పూదరి నరసయ్య కోశాధికారి: బింగి రాజేశం (శ్రీరాంపూర్) సలహాదారులు పెట్టం లక్ష్మణ్, ఎస్. మహేందర్, రాజు, బోడ రాజమౌళి, గెల్లి రాజలింగు, రెక్కల నారాయణరెడ్డి, గట్టు ప్రమోద్ ఉపాధ్యక్షులు ఏ.గంగయ్య (శ్రీరాంపూర్), రేణిగుంట్ల కొమురయ్య (మందమర్రి), ఎం.ఎ. రహమాన్ (బెల్లంపల్లి) పానుగంటి పోశయ్య (పాత మంచిర్యాల) నూనె మల్లయ్య (శ్రీరాంపూర్) బూర్ల జ్ఞాని (హైటెక్ సిటీ) కార్యదర్శులు జెట్టి మురహరి (అమ్మ గార్డెన్) సుంకరి రమేష్ (అమ్మ గార్డెన్) కల్వల చంద్రయ్య (శ్రీరాంపూర్) ఆడెపు రాజయ్య (మందమర్రి) ఎరుకల సుందర్ రావు (బెల్లంపల్లి) దేవులపల్లి రామస్వామి (మంచిర్యాల) కలువల నరసయ్య (రామకృష్ణాపూర్) పోతురాజుల చంద్రయ్య (ఆర్ఆర్ నగర్) దొంతుల సాయన్న, మంచాల రామయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శులు మంచి రాజేశ్వర్ (ఆర్ఆర్ నగర్) కంతం సతీష్ (సిసిసి) నిచ్చకొల్ల అంజయ్య (అమ్మ గార్డెన్) గోపతి లక్ష్మణ్ (లక్ష్మీ నగర్) పప్పు నారాయణ (అమ్మ గార్డెన్స్) గోనే తిరుపతిరావు (సిసిసి) పేరాల రాజమల్లు (బెల్లంపల్లి) ఇతర కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య తీర్మానాలు జిల్లా కమిటీ కింది కీలక అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించింది: సింగరేణి బొగ్గు పెన్షన్ దారులకు పెన్షన్ పెంచాలి కనీస పెన్షన్‌ను ₹15,000 కు పెంచాలి కరువు భత్యంతో కూడిన పెన్షన్ అమలు చేయాలి సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డు పరిమితిని రూ 8 లక్షల నుంచి రూ 25 లక్షలకు పెంచాలి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యుటీ రూ 20 లక్షలు చెల్లించాలి ఇల్లు లేని విశ్రాంత ఉద్యోగులకు కంపెనీ ఖాళీ క్వార్టర్లు కేటాయించాలి. ఆసరా పెన్షన్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని సంఘ నాయకుల పిలుపు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధన కోసం సంఘం నిస్వార్థంగా పనిచేస్తుందని తెలిపారు.ఇంకా ఆసక్తి కలిగిన విశ్రాంత సింగరేణి ఉద్యోగులు సంఘంలో చేరి సేవ చేయాలని తమ వివరాలను జిల్లా బాధ్యులకు తెలియజేయాలని కోరారు.