” ఎర్లీ బర్డ్ ” స్కీం 5% రాయితిని నగర ప్రజలు సద్వినియోగం చేస్కోవాలి

నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 కరీంనగర్ న్యూస్ : కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యలయంలో సోమవారం రోజు పౌర సేవా కేంద్రాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-2027 కు సంబంధించిన ఆస్తి పన్నులు చెల్లిస్తున్న కౌంటర్ ను తనిఖీ చేసి పరిశీలించారు. ఎర్లీ బర్డ్ స్కీంలో ప్రజలు పన్నులు చెల్లిస్తున్న వివరాలను అధికారులు, సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. 5% శాతం రాయితీతో ఆస్తి పన్నులు చెల్లించేందుకు ప్రజల అధికంగా వస్తుండటంతో… కౌటర్ల పెంపు, సిటిజన్స్ కోసం ఏర్పాటు చేసే సౌకర్యాల పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ కల్పిస్తున్న 5% శాతం రాయితీ అవకాశంను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్కోవాలని కోరారు. ఆస్తి పన్నులు చెల్లించేందుకు నగరపాలక సంస్థ కు వస్తున్న సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ కు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవ కేంద్రం ఆవరణలో అదనంగా మరిన్ని ఆస్తి పన్ను చెల్లింపు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే వారికి త్రాగు నీరు, ఉక్కపోతకు కూలర్లు, సీనియర్ సిటిజన్స్ కు కూర్చునేందుకు బెంచిలు తదితర వసతి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సకాలంలో 2026-2027 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుల చచెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధి సహకరించాలన్నారు. రాయితీ అవకాశంను సద్వినియోగం చేస్కోని వడ్డీ భారంను తగ్గించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ ఖాధర్ మొహియుద్దీన్, ఆర్వో శివప్రసాద్, కార్పోరేటర్లు కాజ రమ శివరాం, బండ రమణారెడ్డి, భారీ అపర్ణ జితేందర్, చంద్ర, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *