బోయకొండ పక్షిరాజుపురం అడవిలో వ్యక్తి దారుణ హత్య…?

ప యనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 07.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) బోయకొండ సమీపంలోని పక్షిరాజుపురం కు సమీపంలోని అడివిలోవ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగు చూసింది తమిళనాడు రాష్ట్రం గుడియాతం కు చెందిన గాంధీ 35 అతని కుమారుడు సందీప్ 4 సంవత్సరాలు 20 రోజుల క్రితం బోయకొండ సమీపంలోని ఆర్ఆర్ కాలనీలో నివాసముండే తన భార్య రఫాతి ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు వచ్చారు అయితే అప్పటికే ఆర్ఆర్ కాలనీకి చెందిన నర్సిమ్ములతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న రఫాతి భర్త గ్రామానికి వెళ్లేందుకు నిరాకరించింది దీంతో 20 రోజులుగా ఇక్కడే ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు ఈ క్రమంలో నరసింహులు అతని స్నేహితులతో కలిసి గాంధీని అతని కుమారుడు సందీప్ లను ఆదివారం రాత్రి పక్షిరాజుపురం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు ఉదయం సందీప్ పక్షిరాజు పురం లోని అంగన్వాడి కేంద్రం కు వచ్చి తన తండ్రిని కొట్టారని చూపిస్తాను అంటూ వారిని తీసుకెళ్లి చూపించగా అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించిన అంగన్వాడి టీచర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పుంగునూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ ఎస్ ఐ చిన్న రెడ్డప్పసంఘటన స్థలాన్ని చేరుకున్నారు చుట్టుపక్కల వారిని విచారణ జరిపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *