ఘట్టుప్పల్ మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

పయనించే సుర్యుడు న్యూస్ ఘట్టుప్పల్ ఏప్రిల్ 07. ఘట్టుప్పల్ మండల వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శక్తి కేంద్రం ఇంచార్జ్ కొంగరి పాండు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రావుల ఎల్లప్ప హాజరై మాట్లాడుతూ జనసంగ్ నుంచి 1980 ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్కే అద్వాని ఆధ్వర్యంలో బీజేపీగా అవతరించిందన్నారు. అప్పుడు ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ వరుసగా మూడవసారి అధికారంలోకి రావడం, ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోలు మార్కండేయ, తిరందాసు చక్రపాణి, చిలువేరు దుర్గయ్య, కర్నాటి మనోహర్, తిరందాసు ఆంజనేయులు, గంజి రాములు, గుర్రం శ్రీనివాస్, ఇడం రాజు, కొంగరి నరహరి, ఇంగిలి ప్రవీణ్, పెండ్యం శ్రీను తదితరులు పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *